షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

Byline :  Vijay Kumar
Update: 2024-01-16 14:03 GMT

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులైన విషయం తెలిసిందే. కాగా షర్మిల నియామకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం రేవంత్ రెడ్డి దావోస్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన షర్మిలకు గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేశారు. 'ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల గారికి శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు. షర్మిల నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఇక తన నియామకంలో సహకరించిన ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో కలిసి పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే పార్టీ ఏపీ తాజా మాజీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, ఏపీలోని పార్టీ ముఖ్య నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు. 

Tags:    

Similar News