రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్కు విషెస్ చెప్పిన సీఎం రేవంత్

Byline :  Vijay Kumar
Update: 2024-01-01 09:57 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ దంపతులకు బొకే ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కూడా గవర్నర్ దంపతులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక సీఎం, స్పీకర్, మంత్రులకు కూడా గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News