ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Update: 2024-01-12 10:58 GMT

ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల్లో తప్పులుంటే నేరుగా లబ్దిదారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల్లో తప్పులు జరగడం సహజం అని, అంత మాత్రానికి దరఖాస్తులు పక్కనపెడితే అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే

ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులున్నా ఎట్టి పరిస్థితల్లో పక్కన పెట్టొదని సూచించారు. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6 వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం కోటి 25 లక్షల మంది ఆరు గ్యారెంటీల్లోని పలు పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియను ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలాఖరులో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అంతకు ముందే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన లబ్దిదారులను ఎంపిక చేయాలని కృతనిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది.




Tags:    

Similar News