కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని దాచిపెట్టారు.. సీఎం రేవంత్

Byline :  Vijay Kumar
Update: 2023-12-27 09:41 GMT

మళ్లీ అధికారంలోకి వస్తాననే ధీమాతో నాటి సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం ఎన్నికలకు ముందే 22 ల్యాండ్ క్రూయిజర్లు కొన్నారని, వాటిని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ రూ.3 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. తాను సీఎం పదవి చేపట్టిన 10 రోజుల తర్వాత తనకు ఈ విషయం తెలిసిందని సీఎం తెలిపారు. ఇప్పుడున్న కాన్వాయ్ లోని వెహికిల్స్ ను రిపేర్ చేయించి ఉపయోగించుకోవడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే గత ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రజా ధనాన్ని ఇష్టమొచ్చినట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక స్థితి పూర్తిగా కళ్లకు కనబడుతోందని అన్నారు. లంకె బిందెలు ఉంటాయని తాము అనుకుంటే, ఖాళీ కుండలు కనబడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని నాటి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకులు రాష్ట్ర ఖజానాను మొత్తం తుడుచుకుపెట్టుకుపోయారని అన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రజలకు తెలియజేయడానికి తాము శ్వేత పత్రం రిలీజ్ చేశామని సీఎం స్పష్టం చేశారు. ఇక దుబారా ఖర్చులను తగ్గిస్తే రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయట పడేయవచ్చని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాఢిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీఎం అన్నారు.

Tags:    

Similar News