రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కలిశారు. శుక్రవారం సీఎం రేవంత్ తన సతీమణి గీతతో కలిసి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం 'ఎట్ హోం' కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. కాగా ఎట్ హోం కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.