రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలకు ఆ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. ఇప్పటికే పలు ఎంపీ సెగ్మెంట్లకు ఇంఛార్జ్ లను నియమించింది. అందులో భాగంగా చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ ఎంపీ స్థానాల బాధ్యతలను అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తాజాగా అబ్జర్వర్లను కూడా నియమించింది ఆ పార్టీ.
పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అబ్జర్వర్లు వీళ్లే
1. వరంగల్ - రవీంద్ర దాల్వి
2. జహిరాబాద్ - మేయప్పన్
3. నాగర్‌కర్నూలు - పీవీ మోహన్
4. ఖమ్మం - ఆరీఫ్ నసీంఖాన్
5. నల్లగొండ - రాజశేఖర్ పాటిల్
6. పెద్దపల్లి - మోహన్ జోషి
7. మల్కాజ్‌గిరి - రిజ్వాన్ అర్షద్
8. మెదక్ - యూబీ వెంకటేశ్
9. సికింద్రాబాద్ - రూబీ మనోహరన్
10. హైదరాబాద్ - భాయ్ జగదప్
11. భువనగిరి - శ్రీనివాస్
12. మహబూబాబాద్ - శివశంకర్‌రెడ్డి
13. ఆదిలాబాద్ - ప్రకాశ్ రాథోడ్
14. నిజామాబాద్ - అంజలీ నింబాల్కర్
15. మహబూబ్‌నగర్ - మోహన్ కుమార్ మంగళం
16. చేవెళ్ల - ఎం.కె.విష్ణుప్రసాద్
17. కరీంనగర్ - క్రిష్టోఫర్ తిలక్