కాంగ్రెస్, సీపీఐ మధ్య విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన నారాయణ

Update: 2023-12-29 09:55 GMT

సింగరేణి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. ఈ మేరకు మీడియాకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నికలకు కాంగ్రెస్, సీపీఐ మధ్య ఉన్న మైత్రికి ఎలాంటి సంబంధంలేదని అన్నారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం లేదని, సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ సొంతంగా పోటీ చేశాయని అన్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, సీపీఐ అనుబంధ సంఘాలు పని చేశాయని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని, సీఐటీయూ కార్యకలాపాలకు కాంగ్రెస్, సీపీఐ మధ్య ఉన్న పొత్తుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని నారాయణ అన్నారు. కాగా ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ 5 చోట్ల విజయం సాధించగా..ఐఎన్టీయూసీ ఆరు చోట్ల గెలుపొందింది. ఇక గతంలో తొమ్మిది డివిజన్లలో ప్రాతినిధ్యమున్న టీజీబీకేఎస్ ఈసారి ఖాతా కూడా తెరువలేకపోయింది.




Tags:    

Similar News