Bhatti Vikramarka : రోడ్డు మీద ప్రజా పాలన దరఖాస్తులు.. డిప్యూటీ సీఎం భట్టి రియాక్షన్ ఇదే

Byline :  Vijay Kumar
Update: 2024-01-09 12:42 GMT

కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ఆర్బాటంగా స్వీకరించిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులు రోడ్డుపై గాల్లో ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ప్రతి ఒక్కరికీ దరఖాస్తులు పంచామని, కొన్ని రోడ్డు మీద పడుంటాయని అన్నారు. కాగితాలు తీసుకుపోతుంటే జారిపోతే మళ్లీ తిరిగి తీసుంటారు అందులో ఏముంది అని అన్నారు. లక్షల సంఖ్యలో దరఖాస్తులు పంచినప్పుడు ఇలాంటివి జరగడం సహజం అని అన్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా రోడ్డు మీద ప్రజా పాలన దరఖాస్తుల ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హయత్ నగర్ సర్కిల్ కు చెందిన ఓ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.




Tags:    

Similar News