వాళ్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు: Deputy CM Bhatt

Byline :  Vijay Kumar
Update: 2024-01-28 11:56 GMT

బిల్డర్స్ కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్ లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సంక్షేమం అమలకు సంపద కావాలని, అయితే సంపదను సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజావసరాలను ప్రభుత్వాలు తీర్చగలవు అని అన్నారు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన తమ ప్రభుత్వంలో ఉండదని అన్నారు.

చాలా నిర్మాణ రంగ సంస్థలు బ్యాంకు గ్యారెంటీ రుణాలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టిన తర్వాత సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత వరకు తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి ఇక్కడే స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారందరికీ తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. 

Tags:    

Similar News