హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ రోజు నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు. అనంతరం గగన్ మహల్ లోని ఏవీ కాలేజీలో జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పాల్గొన్నారు.