ఢిల్లీలో పీవీకి స్మారక స్థలం ఎందుకు లేదు.. దేశపతి శ్రీనివాస్

Byline :  Vijay Kumar
Update: 2023-12-17 12:29 GMT

దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై హరీశ్ రావు ప్రేమను ఒలకపోయడం ఆశ్చర్యంగా ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తప్పుబట్టారు. నిన్న అసెంబ్లీలో పీవీ గురించి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ఆయన.. పీవీని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని అన్నారు. పీవీ చనిపోతే ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాలేదని అన్నారు. అంతేకాకుండా ఆయన పేరిట ఎలాంటి స్మారక చిహ్మాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.

పార్టీ కష్టకాలంలో ప్రధాని పదవి చేపట్టి పార్టీ కోసం ఎంతో సేవ చేసిన పీవీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. పీవీపై కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటే ఢిల్లీలో పీవీ స్మారక ఘాట్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఠీవీ పీవీ అన్న దేశపతి.. పీవీకి బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చిందని అన్నారు. ఆయన జయంతి రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని, ఆయన స్మారకంగా పలు నిర్మాణాలు చేసిందని అన్నారు. అలాగే పీవీ మీద ఉన్న గౌరవంతో ఆయన కూతురు సురభి వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని అన్నారు.

Tags:    

Similar News