సిద్ధిపేటకు ఆ అవార్డు రావడం సంతోషంగా ఉంది.. మాజీ మంత్రి
By : Vijay Kumar
Update: 2024-01-11 12:44 GMT
స్వచ్ఛసర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల్లో తాజాగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలో పరిశుభమైన నగరంగా సిద్ధిపేట గనరం కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సాధించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. దక్షిణ భారతదేశంలోని పరిశుభ్ర నగరాల్లో సిద్ధిపేట మొదటి స్థానంలో నిలవడం సంతోషకరం అని అన్నారు. ప్రజల సహకారం, అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు. సిద్ధిపేటను అందంగా తీర్చిదిద్దడానికి వాళ్లంతా చాలా కష్టపడ్డారని, వారందరికీ శుభాకాంక్షలు అని హరీశ్ రావు అన్నారు.