రాష్ట్ర ఖజానా నుంచే ఆ బియ్యం ఇచ్చాం.. హరీశ్ రావు

Byline :  Vijay Kumar
Update: 2023-12-20 13:27 GMT

శ్వేత పత్రంపై జరుగుతున్న చర్చలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కిలో బియ్యం మాత్రమే ఇచ్చిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ‌లోని 89 ల‌క్ష‌ల 99 వేల కార్డుల్లో కేంద్రం 56 ల‌క్ష‌ల కార్డుల‌కు మాత్ర‌మే బియ్యం ఇస్తోందని, మిగ‌తా 34 ల‌క్ష‌ల కార్డుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జ‌ానా నుంచే ఆరు కిలోల బియ్యం ఇచ్చామని తెలిపారు. ఇక కరోనా సందర్భంగా రెండేళ్లపాటు ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చామని అన్నారు. మొత్తం 2 కోట్ల 90 ల‌క్ష‌ల మందికి బియ్యం ఇచ్చామన్న ఆయన.. కోటి 85 ల‌క్ష‌ల మందికి కేంద్రం ఐదు కిలోల బియ్యం ఇస్తే మిగ‌తా కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ఇక కేంద్రం కిలో బియ్యాన్ని 3 రూపాయలకు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే ఇచ్చిందని అన్నారు. మిగిలిన ఒక కోటి ఐదు లక్షల మందికి ఆరు కిలోల చొప్పును రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించామని హరీశ్ రావు తెలిపారు. 

Tags:    

Similar News