Harish Rao : అసెంబ్లీలో గద్దర్ పాటతో విరుచుకుపడ్డ హరీశ్ రావు

Byline :  Vijay Kumar
Update: 2024-02-17 09:44 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సాగునీటిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శ్వేతపత్రంలో అన్ని అబద్దాలే ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి లేడని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఆనాడు గద్దర్, అందెశ్రీ, జయరాజ్ పాడిన పాటలను నేడు అసెంబ్లీలో హరీశ్ రావు పాడి వినిపించారు.

హరీశ్ రావు పాడిన గద్దర్ పాట ఇదే..

కాంగ్రెస్ పాలనలోరన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో

గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లి కన్నీల్లు రాల్చింది

సింగరేణి తల్లి సిన్నబోయినాది 610 జీవోనేమో జీరో అయ్యినాది

హరీశ్ రావు పాడిన అందెశ్రీ పాట..

ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి

దక్సిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి

నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు

మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లీ

చూడు తెలంగాణ చుక్కలేని నీళ్లు లేని దాన

మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన

హరీశ్ రావు నోట జయరాజు పాట

వానమ్మ వానమ్మ ఒక్కసారన్నవచ్చిపోవే వానమ్మ

చేలల్ల నీళ్లు లేవు చెలకల్ల నీళ్లు లేవు

నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్ళు లేవు

Tags:    

Similar News