Jagga Reddy : మోడీ, కేసీఆర్ మధ్య ప్రేమాయణం.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా మోడీ, కేసీఆర్ మధ్య ప్రేమాయనం నడుస్తోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎప్పటి నుంచో పొత్తు ఉందని, ఆ పొత్తు ప్రస్తుతం కూడా కొనసాగుతోందని అన్నారు. గతంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు చేసిందని అన్నారు. అలాగే మోడీ నోట్ల రద్దు చేసినప్పుడు కూడా కేసీఆర్ కేంద్రానికి అండగా నిలబడ్డారని అన్నారు. అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని అన్నారు. అలా వాళ్ల రాజకీయ ప్రేమాయనం కొన్నేళ్లు నడిచిందని, అయితే ఆ తర్వాత వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారి మధ్య మళ్లీ ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని అన్నారు. పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన మాట్లాడరని అన్నారు. కానీ తమ ప్రభుత్వంపై మాత్రం నిత్యం ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తూ బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తోందని, ఈ నెల 27 నుంచి మరో రెండు హామీలు కూడా అమలు చేస్తామని తెలిపారు. మాట ఇచ్చిందంటే తప్పే పార్టీ కాంగ్రెస్ కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని తెలిపారు. సమ్మక్క-సారక్క పండుగను జాతీయ పండుగ చేస్తామని గతంలో చెప్పిన కిషన్ రెడ్డి.. తాజాగా అది సాధ్యం కాదని చెప్పడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని అన్నారు. తాజా రాజకీయాలను బట్టి చూస్తే ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందేమోననే అనుమానం కలుగుతోందని అన్నారు. ఆ అవగాహన ప్రకారమే ఇప్పుడు కవిత ని దోషిగా సీబీఐ నిలబెట్టిందని అన్నారు.
కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు రావొద్దంటే కవితని విచారణకి పిలుస్తున్నాం అని చెప్పుకోవాలని బీజేపీ చూస్తుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని అన్నారు.