ఫ్రీ జర్నీపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

Byline :  Vijay Kumar
Update: 2024-01-05 11:11 GMT

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ మహిళలకు ఫ్రీ జర్నీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ కు మంచి స్పందన వస్తోందని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఈ పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇప్పటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు బెంజీ కార్లలో తీరుగుతారని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం గురించి వాళ్లకేమీ తెలియదని అన్నారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు రెచ్చిపోతున్నారని, కానీ తాను అసెంబ్లీలో ఉంటే వాళ్ల ఆటలను సాగనిచ్చేటోన్ని కాదని అన్నారు. ఫ్రీ జర్నీపై చర్చకు హరీశ్ రావు, కేటీఆర్ సిద్ధమా అని సవాలు విసిరారు. 6 గ్యారెంటీల అమలకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనే బీఆర్ఎస్ నాయకులు బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎవరెన్నీ రకాలుగా విమర్శించిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News