Kadiyam Srihari : 'జై తెలంగాణ' అంటే కొడతారా?

Byline :  Vijay Kumar
Update: 2024-02-26 11:00 GMT

ఇందిరమ్మ రాజ్యం అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. మేడారంలో సీఎం రేవంత్ సందర్భంగా ‘జై తెలంగాణ’ అని నినదించినందుకు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరులో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని అన్నారు. మేడారం అమ్మవార్ల ఆలయం గేట్ తీసినప్పుడు కొంతమంది కార్యకర్తలు, భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వచ్చారని అన్నారు. అలా తోసుకుని వెళ్లిన క్రమంలో అక్కడ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ ను నెట్టివేశారంటూ దాదాపు 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని అన్నారు. సీఎం రేవంత్ 23న మేడారం వెళ్తే 26 ఉదయం కానిస్టేబుల్ చేత కేసు పెట్టించారని అన్నారు. సెక్షన్స్ 143, 149, 363 కింద కేసు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ఈ మూడు సెక్షన్ల కూడా బెయిలబుల్ సెక్షన్లని, స్టేషన్ లో బెయిల్ తీసుకోవచ్చని అన్నారు. కానీ ఈ 12 మంది కార్యకర్తలను గత రాత్రి హంతకులు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్లను అరెస్ట్ చేసినట్లుగా ఇళ్లల్ల నుంచి ఎత్తుకొచ్చారని అన్నారు. విషయం తెలుసుకుని తాము సీపీ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పామని అన్నారు. దానికి ఆయన చట్టపరంగా వ్యవహరిస్తున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరూ కొట్టలేదని సీపీ చెప్పారని అన్నారు.

కానీ బెయిల్ వచ్చాక చూస్తే వారి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయని అన్నారు. ఒక్కొక్కరిని నాలుగైదు రౌండ్లు వరుస పెట్టి కొట్టారని ఆరోపించారు. వారిపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రోకలి బండలు ఎక్కించే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సీపీని డిమాండ్ చేశారు. లేకుంటే 27వ తారీఖున ఆత్మకూరులో నిరసన చేపడుతామని అన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని, ఏసీపీ, ఆత్మకూరు ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News