రాజగోపాల్ రెడ్డిపై కడియం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ : Kadiyam Srihari

Byline :  Vijay Kumar
Update: 2024-02-12 11:19 GMT

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో వాడీవేడి చర్చ నడుస్తోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు, వెంకట్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు అన్నట్లు సభలో పెద్ద ఎత్తున చర్చ నడవగా.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మాట్లాడుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. " ఉకోవయ్యా ఊకో.. నువ్వు హోంమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు, ప్రతిసారీ అడ్డుతగులుతావు" అంటూ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా ఇటీవల అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నాకు హోం మంత్రి కావాలని ఉంది. బీఆర్ఎస్ వాళ్లను జైలుకు పంపాలనేది నా కోరిక. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి సహా అందర్నీ జైలుకు పంపుతా. నేను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు. కేసీఆర్‌ను గద్దె దించడానికే నేను కాంగ్రెస్‌లోకి వచ్చా. అధిష్టానం నాకు హామీ ఇచ్చింది. అందుకే హోం మంత్రి ఇవ్వాలని కోరుతున్నా" అంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 

Tags:    

Similar News