అతడిపై యాక్షన్ తీసుకోండి.. డీజీపీకి కేటీఆర్ రిక్వెస్ట్
Byline : Vijay Kumar
Update: 2024-01-16 11:39 GMT
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి- అల్ల్విన్ కాలనీ 124 డివిజన్‌లో ఓ దుండగుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. పోలీసుల ముందే ఆ దుండగుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగులగొట్టడం గమనార్హం. కాగా ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దుండగుడి దుశ్చర్యని ఖండించారు. తెలంగాణ ప్రజలకు ఆరాధ్య వ్యక్తి అయిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు.
జయశంకర్ సార్ నే అవమానిస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.