KTR : బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేయబోతున్నాయి.. కేటీఆర్

Byline :  Vijay Kumar
Update: 2024-01-14 16:21 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మళ్లోసారి కలిసి పనిచేయబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, కాంగ్రెస్.. బీజేపీ కలిసి రాష్ట్రాన్నిఅభివృద్ధి చేద్దామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. 2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు అర్థమవుతోందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ఎక్స్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.




Tags:    

Similar News