సీఎం రేవంత్ను కలిసిన లెజండరీ డైరెక్టర్

Byline :  Vijay Kumar
Update: 2023-12-31 14:26 GMT

దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు సీఎం రేవంత్ కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కు సంబంధించిన పలు సమస్యలను రాఘవేంద్ర రావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితరులు ఇప్పటికే సీఎం రేవంత్ ను కలిసి విషెస్ చెప్పారు.

Tags:    

Similar News