కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్ధులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఈ మేరకు ఎన్నిక ధృవీకరణ పత్రాలను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ తీసుకున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కారణంగా ఎన్నికలతో పని లేకుండాపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.