Minister Komatireddy Venkat Reddy : చిరంజీవి నా ఫేవరెట్ హీరో..

Byline :  Vijay Kumar
Update: 2024-02-04 09:17 GMT

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య స్థాయికి ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించగా ఇవాళ హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని సన్మానించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి తన ఫేవరెట్ హీరో అని అన్నారు. తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, కాలేజీ రోజుల్లో ఆయన సినామాలంటే పడి చచ్చేవాడినని అన్నారు. చిరంజీవి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. సినీ రంగంలో ఆయన ఎదిగిన తీరు ఎందరికే స్ఫూర్తిదాయకమని అన్నారు.

కేవలం సినిమాలకు పరిమితం కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలు గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లాంటివి స్థాపించి గొప్ప మనసు చాటుకున్న వ్యక్తి చిరంజీవి అన్నారు. అలాంటి వ్యక్తిని ఇవాళ సన్మానించుకోవడం తనకు దక్కిన గౌరవం అని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పద్ద విభూషణ్ అవార్డు అందుకున్న మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీకి ఎంపికైన మరో ఆరుగురు ప్రముఖులు పాల్గొన్నారు.వారందరినీ తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.

Tags:    

Similar News