నూతన సంవత్సరానికి ఇంకా గొన్ని గంటల మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక కొంతమంది అప్పటి దాకా ఆగడమెందుకు ముందే న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తే పోలా అంటున్నారు. సామాన్యలు నుంచి ప్రముఖుల వరకు కొత్త సంవత్సర వేడుకలను ముందే జరుపుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కార్యకర్తలతో కలిసి అడ్వాన్స్ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు.హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతల నడుమ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2024లో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.