GHMC అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. Minister Ponnam Prabhakar

Byline :  Vijay Kumar
Update: 2024-02-07 11:25 GMT

జీహెచ్ఎంసీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ తో కలిసి జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామని, ఆ బ్రాండ్ ను మరింత పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. వచ్చే సమ్మర్ లో నగరంలో ఎలాంటి నీటి ఎద్ధడికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ కు తాగునీటి ఎద్దటి అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని, తాగునీటి సమస్య లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. జీహెచ్ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ముందుకు వెళ్ళబోతున్నామన్న మంత్రి.. అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని వెళ్తామమని పేర్కొన్నారు.

మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు ఉంటాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పై రోజూవారీగా సమీక్షలు, సమస్యల పై రిపోర్ట్ తయారీ ఉంటుందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచన చేశామని అన్నారు. జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించామని అన్నారు. అప్పులు-ఆస్తులు అంశాలపై ముఖ్యమంత్రి కి నివేదిక ఇవ్వనున్నామని అన్నారు. గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఉంటుందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓ డీఎస్డీని నియమిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Tags:    

Similar News