ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు లేదు - మంత్రి పొన్నం
ఈ నెల 6తో ప్రజాపాలన దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో గడువు పొడిగింపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉందని, ఈలోపు అర్హులైనవారు అప్లికేషన్ పెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అని అన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను రక్షించేందుకే బీజేపీ నాయకులు ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతున్నారని అన్నారు. ఇన్నేళ్ల నుంచి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు లేఖ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బినామీ అని కామెంట్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని, వారందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు.