ప్రాజెక్టులో లోపాలున్నాయని ఆనాడే చెప్పాను.. Minister Thummala
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోనే లోపాలున్నాయని అన్నారు. దాని వల్లే పిల్లర్లు కుంగాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేడిగడ్డను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయని నాటి సీఎం కేసీఆర్ కు ఆనాడే చెప్పానని, అయితే ఆయన తనను పట్టించుకోలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైంది మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజీ అని, మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నిలిస్తేనే ఎక్కడికైనా ఎత్తిపోసేదని అన్నారు. కానీ మేడిగడ్డలో నీరు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మేడిగడ్డలో నీళ్లు లేకపోతే మిగతా జలాశయాలకు నీటిని ఎలా ఎత్తిపోస్తారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నాటి సీఎం కేసీఆర్ ప్రజా ధనాన్ని వృధా చేశారని అన్నారు. పక్కా ప్రణాళిక లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని అన్నారు.
కాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు. అక్కడ కుంగిన పిల్లర్లను వాళ్లు పరిశీలించారు. ఇక మేడిగడ్డకు రావాలని సీఎం రేవంత్ కోరగా సీపీఐ, ఎంఐఎం సభ్యులు మాత్రమే మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లలేదు. బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పెట్టిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.