డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు.. మంత్రి ఉత్తమ్

Update: 2024-01-13 11:29 GMT

వచ్చే డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించామని తెలిపారు. జూన్ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని, అయినా అందుకు తగిన ఫలితాలు రాలేదని అన్నారు. అందుకే తాము అవసరం మేరకు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని మంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News