రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్జీవనానికి పునాదులు వేసిన బడ్జెట్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వ్యవస్థకు పునర్జీవనం కల్పించేలా బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్ కూర్పులో దూర దృష్టి, సమతుల్యతను ప్రదర్శించారని అన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత బీఆర్‌ఎస్ హయాంలో నాశనం చేశారని, దాన్ని మళ్లీ గాడిలో పెట్టేలా ఈ బడ్జెట్ ఉందని అన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాలు డిమాండ్లతో ఏర్పడిన తెలంగాణ గత పదేళ్లలో ఏమాత్ర అభివృద్ధి చెందలేదని, ముఖ్యం సాగునీటి రంగం ఆగమైందని అన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వారందరినీ విచారించి శిక్షిస్తామని అన్నారు. ఇప్పటికే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు మరియు అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని ఆయన అన్నారు. తెలంగాణకు కృష్ణానది, గోదావరి నదిలో సరైన నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
బడ్జెట్‌లో నీటి పారుదల విభాగానికి రూ.28,024 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరందించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ముందుగా ప్రకటించినట్లుగా, తక్కువ వ్యయంతో పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టును సృష్టించగల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు ఎల్‌ఐఎస్, రాజీవ్ బీమా ఎల్‌ఐస్, కోయిల్ సాగర్ ఎల్‌ఐఎస్, ఎస్‌ఆర్‌ఎస్‌పి-ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ స్కీమ్ కొమరం భీం, చిన్న కాళేశ్వరం వంటి వంటి ఇతర ప్రాజెక్టులు చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత - అభయ హస్తం (ఆరు హామీలు) అమలు కోసం రూ.2.75 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌లో 53,196 కోట్లతో 500 రూపాయలకే ఎ్ పీజీ సిలిండర్‌ను అందజేస్తామన్న హామీలలో ఒకదానిని పౌర సరఫరాల శాఖ తమ పరిధిలోని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రక్రియలో గణనీయంగా దోహదపడుతున్న బడ్జెట్ అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమతూకం కలిగిందని ఆయన అన్నారు.