సీఎం రేవంత్ను కలిసిన మంత్రి వెంకట్ రెడ్డి

Update: 2023-12-25 09:06 GMT

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, సాత్విక్ రెడ్డి ఉన్నారు. కాగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వ్యక్తిగతంగా ఆయనను కలవడం ఇదే తొలిసారి. ఇక మంత్రి వెంకట్ రెడ్డి సీఎం రేవంత్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఈ ఇద్దరి నేతల మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పార్టీలోని సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు మరికొంత మంది సీనియర్లు ఇప్పటికే సీఎం రేవంత్ కు తమ పూర్తి సపోర్ట్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సీఎంను కలవడం ద్వారా తన పూర్తి మద్దతును తెలియజేశారని, కలిసి పని చేద్దామని అన్నట్లు తెలుస్తోంది. సీఎంకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి.. తన శాఖకు సంబంధించిన పలు అంశాలను కూడా సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News