balmoori venkat : హుజురాబాద్ను అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Byline :  Vijay Kumar
Update: 2024-02-11 10:12 GMT

హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారి హుజురాబాద్ కు రాగా కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని బాధపడొద్దని కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు ధైర్యం కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే పెద్దపల్లి జిల్లాకు భారతరత్న పీవీ నరసింహారావు పేరు పెట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచారని అన్నారు. తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన ప్రజలను బెదిరించారని అన్నారు. ఆయనతో నియోజకవర్గానికి కలిగే ప్రయోజనం ఏం లేదని అన్నారు. అనుకున్న సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు, అసత్య ప్రచారం చేసినా తమ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలెవరూ అనుకోలేదని, అందుకే వారంతా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆరు గ్యారెంటీల ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారని, వాళ్లకు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం ఏమాంత్రం ఇష్టంలేదని అన్నారు.




Tags:    

Similar News