MLC Kavitha : అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ?: ఎమ్మెల్సీ కవిత

Byline :  Vijay Kumar
Update: 2024-01-22 11:59 GMT

అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా తనపై చేసిన విమర్శలను ఎమ్మెల్సీ కవితి తిప్పికొట్టారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారని మంత్రిపై విరుచుకుపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే అభ్యంతరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అని ప్రశ్నించిన కవిత.. స్ఫూర్తిదాయక వీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించామన్న ఆమె.. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం తమ ఈ కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నానని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడన్న కవిత.. అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి ఫూలే అని కొనియాడారు. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరఫునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరఫును కోరుతున్నానని అన్నారు.




Tags:    

Similar News