రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ కు బీ-ఫామ్స్ ఇచ్చిన సీఎం రేవంత్

Update: 2024-02-15 10:36 GMT

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ లను ఆ పార్టీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు సీఎం రేవంత్ రెడ్డి బీ-ఫామ్ లు అందజేశారు. అనంతరం వారిద్దరూ శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో తమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. కాగా తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దిరాజు రవిచంద్ర ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేయగా.. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ తాజాగా తమ నామినేషన్లను సమర్పించారు.

ఇక ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు నామినేషన్ వేశారు. తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. కాగా కాంగ్రెస్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన అనిల్ యాదవ్ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజనీ కుమార్ కుమారుడు అనే విషయం తెలిసిందే.



Tags:    

Similar News