సీఎం అవుతానని ఏనాడు అనుకోలేదు.. Revanth Reddy

Byline :  Vijay Kumar
Update: 2024-01-06 14:59 GMT

సీఎం అవుతానని జీవితంలో తాను ఏనాడు అనుకోలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 17 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత తొందరగా సీఎం వంటి ఉన్నతమైన పదవిని చేపడుతానని ఏనాడు అనుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల దయ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తాను సీఎం అయ్యానని అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తాను చాలా దూకుడిగా వ్యవహరించానని, కానీ సీఎం అయ్యాక చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానని అన్నారు. అప్పుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా అలా చేయాల్సి వచ్చిందని, కానీ సీఎం అయ్యాక అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని అన్నారు. ప్రతి రోజు కష్టపడుతూ, నేర్చుకుంటూ పాలన చేస్తున్నాని అన్నారు. ఓ కాలేజీ విద్యార్థిలా ప్రతి రోజు ప్రిపేరై సెక్రటేరియట్ కు వెళ్తున్నానని అన్నారు.

Tags:    

Similar News