ప్రభుత్వ సలహా కమిటీలో ఆర్ఎస్ ప్రవీణ్.. క్లారిటీ

Byline :  Vijay Kumar
Update: 2024-01-02 12:23 GMT

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రొ.హరగోపాల్, ప్రొ.నాగేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతో కూడిన ఓ సలహామండలిని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తాను ప్రభుత్వ సలహా కమిటీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. సాధారణంగా ఇలాంటి కమిటీల్లోకి ఎవరిని ఎంపిక చేయాలన్నది ఆయా వ్యక్తులను సంప్రదించిన తరువాతే ఫైనల్ చేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ సంప్రదించినా తాను ప్రతి పక్షంలో ఉన్న ఒక జాతీయ పార్టీ(బీఎస్పీ)కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని అన్నారు.

ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆలోచనలను జనంలో తీసుకొని పోయే ఉద్యమంలో తలమునకలై ఉండడం వల్ల ఎలాంటి ప్రభుత్వ సలహా కమిటీల్లో ఉండే పరిస్థితి లేదని అన్నారు. అత్యవసర స్థితిలో తప్ప అధికారంలో లేని రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రజల గొంతుకలా ఉండాలే తప్ప, ప్రభుత్వ కమిటీలలో ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్వతంత్రంగా ఆలోచించే మేధావులకు కొరత లేదని, అలాంటి వాళ్లను ఇలాంటి కమిటీల్లోకి తీసుకుంటే బాగుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News