ఆ ఎన్నిక గురించి ఈసీకి ఆర్ఎస్పీ ఫిర్యాదు

Update: 2023-12-18 15:12 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధిని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎస్టీ (మహిళ) పదవికి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. చైర్ పర్సన్ పదవికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎస్టీ మహిళ స్థానంలో జనరల్ అభ్యర్థిని తాత్కాలిక చైర్మన్ గా చేయడంపై ఫిర్యాదు చేశారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఆదివాసీ, గిరిజన మహిళలకు రాజ్యాంగం కల్పించిన రాజకీయ హక్కులను కాపాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కోరారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడ్డ స్థానంలో జనరల్ కేటగిరీకి చెందిన ప్రస్తుత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావును తాత్కాలికంగా చైర్మన్ గా ఎంపిక చేయడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. కాగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న కోవా లక్ష్మి ఇటీవల ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆమె స్థానంలో కోనేరు కృష్ణారావు ఎంపికయ్యారు.

Tags:    

Similar News