సాలార్ జంగ్ మ్యూజియంలో కొత్త గ్యాలరీలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Byline : Vijay Kumar
Update: 2024-01-20 16:29 GMT
హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో మరికొన్ని గ్యాలరీలు చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న గ్యాలరీలకు కొత్త గ్యాలరీలను చేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్తగా చేర్చనున్న గ్యాలరీల్లో యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ, యూరోపియన్ కాంస్య గ్యాలరీ, ఇండియన్ స్టోన్ స్కల్ప్చర్ గ్యాలరీ, బిద్రి వేర్ గ్యాలరీ, దీపాల గ్యాలరీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం ఈ గ్యాలరీలను చేర్చనున్నట్లు ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కేంద్ర మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.