ఈ సంక్రాంతికి ఈ విషెస్ ట్రై చేయండి.. థ్రిల్ అవడం పక్కా!!

Update: 2024-01-13 10:35 GMT

సంక్రాంతి అంటే.. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, పిండి వంటలు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందాలు, గాలి పటాలు, పూజలు, కొత్త బట్టలు. సంక్రాంతి అంటే.. పంటలు, పశువులు. సంక్రాంతి అంటే సందడి. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి అంటే ఓ సంతోషం.. ఓ సరదా. మరి అలాంటి ఈ పండుగను జరుపుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. బంధుమిత్రులు, కొత్త అల్లుళ్ల రాకతో తెలుగు పల్లెలు నూతన శోభను సంతరించుకున్నాయి. పసివాడి నుంచి పండు ముసలి వరకు అందరూ ఆనందంగా జరుపుకునే ఈ పండుగకు ఈ స్పెషల్ కోట్స్ (శుభాకాంక్షలు) పంపి మీ బంధుమిత్రులను థ్రిల్ చేయండి.

ఈ స్పెషల్ సంక్రాంతి కోట్స్ మీకోసమే..

1.భోగ భాగ్యాలనిచ్చే భోగి.. సరదాలనిచ్చే సంక్రాంతి.. కమ్మని కనుమ.. మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుతూ .. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

2.ఈ పండగ మీ జీవితంలో కొత్త ఆరంభాలు, శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ.. హ్యాపీ సంక్రాంతి

3.సూర్యుని ఈ కొత్త ప్రయాణం మీ జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

4.మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషం.. జీవితకాలం ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ పొంగల్

5.ఆకాశంలో ఎగిరే రంగు రంగుల గాలిపటాల లాగే మీరు ఎల్లప్పుడూ ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ.. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

6.'భోగి' భాగ్యాలతో.. 'సంక్రాంతి' సంపదలతో.. 'కనుమ' కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

7.ఈ భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు.. మనలోని ఈర్ష్య, అసూయ, ద్వేషాలను కూడా వేసి పంటల పండుగ సంక్రాంతికి స్వాగతం పలుకుదాం.. హ్యాపీ సంక్రాంతి

8.ఈ సంక్రాంతి సర్వ సుఖాలను అందించాలని.. కనుమ కష్టాలను తొలగించాలని ఆ భగవంతున్ని వేడుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

9.భోగి మంటలతో రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలుకుతూ..మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

10.ఈ భోగి మంటలు మీ జీవితంలో చీకట్లు పారద్రోలాలి.. మీ ఇంట భోగభాగ్యాలు రావాలి.. మీ జీవితం అత్యంత ఆనందంగా సాగాలి.. అందరికీ భోగి శుభాకాంక్షలు.

11.ఈ భోగి మంటలతో మీ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోవాలి. కొత్త ఆనందం, కొత్త ఆలోచన, కొత్త మార్గాలకు వెలుతురు కావాలి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

12.మకర సంక్రాంతి మీ ఇంట కొత్త కాంతులు వెదజల్లాలి.. ఈ భోగి మీ జీవితంలో కొత్త భోగభాగ్యాలు తీసుకురావాలి..ఈ కనుమ అందర్నీ ఒక్కటిగా కలపాలి.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

13.మీ బాధలు, మీ కష్టాలు, మీ దుఖం అంతా భోగమంటల్లో కాల్చేయండి..ఆ వెలుతురులో కొత్త ఆనందం, కొత్త మార్గం అణ్వేషించండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

14.నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు

మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు

పంచెకట్టులు, పందెంకోళ్లు

హరిదాసులు, డూడూ బసవన్నలు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక

మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

15.పాలలోని తెల్లదనం

చెరుకులోని తియ్యదనం

ముగ్గులోని రంగుల అందం

మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం

సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రమా!

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ..

మన సంప్రదాయన్ని విశ్వమంతా తెలుపుతూ..

పల్లె అందాలను ప్రపంచానికి చూపుతూ..

ఈ సంక్రాంతి పండుగను జరుపుకోండి.

ఈ సంక్రాంతికి కొన్ని ఇంగ్లీష్ విషెస్

1.May the sweetness of gur and the warmth of til bring happiness and prosperity to your life this Makar Sankranti.

2.Wishing you a Makar Sankranti filled with sweet moments and cherished memories. Happy Makar Sankranti!

3.Let's celebrate the harvest festival with joy and happiness. Wishing you a very Happy Makar Sankranti!

4.On this auspicious day of Makar Sankranti, may your life be filled with the joy of kites and the sweetness of jaggery.

5.Happy Makar Sankranti! May your life be blessed with love, luck, and prosperity on this festive occasion.

6.Let the vibrancy and color of Makar Sankranti brighten up your life. Wishing you a joyous Makar Sankranti!

7.As the sun starts its northward journey, may it light up your life with new hopes and energy. Happy Makar Sankranti!

8.Here's wishing you and your family a very bliss Makar Sankranti.

9.May this Makar Sankranti usher in goodness, peace, good health and happiness to yo…

Tags:    

Similar News