పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ

Byline :  Vijay Kumar
Update: 2023-12-24 13:26 GMT

రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్.. తాజాగా ఆరుగురు ఐఏఎస్, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి ఈవీ నర్సింహ్మారెడ్డి, ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఈ.శ్రీధర్, ఇంటర్ విద్యా డైరెక్టర్ శృతి ఓజా, సివిల్ సప్లయిస్ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ లను నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న భారతి హోలికెరిపై వేటు వేసింది రాష్ట్ర సర్కార్. ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టింది. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.

Tags:    

Similar News