Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీని రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖపై రేపు శ్వేతపత్రం పెడతామని ప్రభుత్వం ప్రకటించగా.. ఎజెండాలో ఉన్నందున ఇవాళే పెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు డిమాండ్ చేశారు. ఇవాళ పెట్టకపోతే ఈనెల 25 నుంచి మళ్లీ సమావేశాలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బీఏసీ నిర్వహించకుండా మరో రోజు ఎలా పొడిగిస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. కాగా ఇవాటి సమావేశాల్లో బీసీ కులగణనపై తీర్మానం ప్రవేశపెట్టగా దానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇంటింటికి సర్వే నిర్వహిస్తామని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాము ఈ కులగణనను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.