తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 'తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ' 'కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TTWR COE CET)- 2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతో పాటు, ఉచిత వసతి ఉంటుంది. వీరికి ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులకు జనవరి 18న లెవల్-1 (ఆబ్జెక్టివ్) పరీక్ష, మార్చి 10న లెవల్-2 (డిస్క్రిప్టివ్) పరీక్షలు నిర్వహింనున్నారు. వివరాల కోసం
https://tstribalwelfare.cgg.gov.inను సంప్రదించగలరు.
Telangana Tribal Welfare Department released notification for inter admissions
.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.01.2024.
.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.02.2024.
.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీలు: 12.02.2024 - 17.02.2024.
.. లెవెల్-1 స్క్రీనింగ్ పరీక్షతేది: 18.02.2024.
.. లెవెల్-2 స్క్రీనింగ్ పరీక్షతేది: 10.03.2024.