Praveen IPS Movie .. రేపు దేవి 70 MMలో వీక్షించనున్న ఆర్ఎస్ ప్రవీణ్

Byline :  Vijay Kumar
Update: 2024-02-19 12:16 GMT

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ ఐపీఎస్ అధికారి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్ 'ప్రవీణ్ IPS' ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిన్నతనంలో ఎదుర్కొన్న పేదరికం, కుల వివక్ష, చదువు కోసం పడ్డ కష్టాలు, సమాజం మార్పు కోసం విద్యార్థిగా, ఉద్యోగిగా చేసిన కృషిని ఈ సినిమాలో చూపించారు. దేశంలోనే అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికై ఐపీఎస్ అధికారిగా తాను సాధించిన విజయాలతోపాటు, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విధానం.. ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాలను మార్చిన సంఘటలను తెరకెక్కించారు.

ఏడేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి డా.బీఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరాం ఆశయాల సాధన కోసం రాజకీయ అరంగేట్రం చేసి కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విధానం సినిమాలో చూడవచ్చు. కాగా ఈ సినిమాను రేపు సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని దేవి థియేటర్ లో ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేవి థియేటర్ కు వస్తారని బీఎస్పీ తెలిపింది. ఇందుకోసం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయనతో కలిసి సినిమా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. 

Full View

Tags:    

Similar News