TSPSC కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు TSPSC ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల గ్రూప్-1కు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే రెండు సార్లు నిర్వహించగా.. రెండు సార్లు పరీక్ష రద్దు అయింది. మొదటిసారి ప్రిలిమ్స్ పరీక్ష గతేడాది నిర్వహించగా.. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు అయింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. అయితే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అవతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థుల హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రతి ఒక్కరూ మళ్లీ అప్లై చేసుకోవాలని, అయితే ఇంతకు ముందు అప్లై చేసుకున్న వాళ్లు అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్-1 తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.