కేంద్ర పథకాలకు ప్రచారం కల్పించండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Byline : Vijay Kumar
Update: 2023-12-24 16:27 GMT
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ కార్యక్రమాలు, వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల మీద జరిగిన రివ్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాటితో పాటు గుడ్ గవర్నన్స్, వీర్ బాల దివస్ కార్యక్రమాల సన్నాహక కార్యక్రమాలను గురించి చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలు మరింత మందికి విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో గెలిచేందుకు బాగా కృషి చేయాలని, అందుకోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.