కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Byline :  Vijay Kumar
Update: 2024-02-25 12:09 GMT

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పేద ప్రజల కోసం కేంద్రంలోని తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. పేదలకు టాయిలెట్ల నిర్మాణం, ఉచితం రేషన్ బియ్యం అందించామని తెలిపారు.అలాగే రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ తరఫున పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, వీధి లైట్లు వంటి అనేక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. గతంలో దేశంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతల సమస్య ఉండేదని, కానీ మోడీ ప్రధాని అయ్యాక అలాంటివేమీ లేవని అన్నారు. కర్ఫ్యూలు, టెర్రరిస్ట్ దాడులు ఉండేవని, హైదరాబాద్ లో జరిగిన ఉగ్రవాద దాడులు అందుకు ప్రత్యక్ష సాక్షమని అన్నారు. అనేక రాష్ట్రాల్లో నేషనల్ హైవేస్ నిర్మిస్తూ రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించామని అన్నారు. ఈ క్రమంలోనే మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ చాలా ఎంపీ సీట్లు గెలుస్తున్నామని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖతం అయ్యిందని, ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆగం చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అన్నారు. హైదరాబాద్ సీటును కూడా బీజేపీ గెలుచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ దేశంలో మూడు చోట్లే అధికారంలో ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అన్ని సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేరని అన్నారు. రాహుల్ గాందీ జన్మలో ప్రధాని కాలేరని, కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే ఓట్లు మురిగిపోతయాని అన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోడీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.




Tags:    

Similar News