మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం.. Kishan Reddy

Byline :  Vijay Kumar
Update: 2024-01-16 11:02 GMT

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ ఎన్ని యాత్రలు చేసినా మోడీ ముందు పని చేయరని అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చే లక్ష్యంతో కాచిగూడ నింబోలి అడ్డలో చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం, ఆధార్ అప్డేషన్ సెంటర్, హెల్త్ క్యాంప్​, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, అటల్ పెన్షన్ యోజన తదితర స్టాల్స్​ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా కేంద్ర పథకాల మీద సరైన అవగాహన కల్పించాలని అధికారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ స్పందనను చూస్తే మోడీ మూడోసారి పీఎం కావడం తథ్యమని అనిపిస్తోందని అన్నారు. ఇంటింటికి బాత్రూమ్ లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత కేంద్రంలోని బీజేపీదని అన్నారు. రేషన్ బియ్యం, కరువు పని తదితర కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటి గురించి ప్రజలకు చెప్పడం లేదని అన్నారు. అందుకే ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏ ఏ పథకాలను తీసుకొచ్చింది.. ఏ ఏ కార్యక్రమాలు చేపట్టిందని తెలుసుకోవడానికే తాము వికసిత్ భారత్ కార్యక్రమం మొదలు పెట్టామని తెలిపారు. దేశంలో బీజేపీని ఓడించే పార్టీయే లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News