సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

Byline :  Vijay Kumar
Update: 2024-01-24 10:16 GMT

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణపై లేఖ రాశారు. భారత్ మాల కింద నిర్మించే రోడ్లకు భూసేకరణ చేయాలని లేఖలో కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం నాయ్ కు50 శాతం నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్లతో 340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మణిహారంలాంటిదని ఆయన అన్నారు. హైదరాబాద్ తో పాటు సమీప పట్టణాల మధ్య ట్రాఫిక్‌ను తగ్గించడంలో ఈ రోడ్డు కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద రింగ్ రోడ్డు ప్రాజెక్టు లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకానికి కావాల్సిన అన్ని ఖర్చులను భరిస్తుందని, కాకపోతే యుటిలిటీ ఖర్చులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వ భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ట్రాఫిక్‌ను నియంత్రించడం, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో గణనీయమైన మార్పు వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఇదే విషయమై గత ప్రభుత్వాని ఎన్నో సార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడాలని కేంద్ర మంత్రి సీఎం రేవేంత్ రెడ్డిని కోరారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరితే నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

Tags:    

Similar News