యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినంతోపాటు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఆదివారం, రేపు న్యూ ఇయర్ కావడంతో ఉద్యోగులకు రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు,ఇతరులు పెద్ద ఎత్తున భద్రాద్రి ఆలయానికి వస్తున్నారు. భక్తుల తాకిడి నేపథ్యంలో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.